Telangana ACB Raids : లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగిని

గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అనే మహిళను పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు

Telangana ACB Raids : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ శివబాలకృష్ణ అవినీతికి తెరపడకముందే ఏసీబీకి మరో అధికారి చిక్కింది. గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే జ్యోతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

Telangana ACB Raids Viral

గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అనే మహిళను పక్కా సమాచారంతో ఏసీబీ(ACB) అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యోతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో అధికారి ఇంటిలో నగదు, బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత బంగారాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. 65 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు.

Also Read : YSRCP MLA : కాక రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!