YS Sharmila : చంద్రబాబు జగన్ ను కలిపి ఏకిపారేసిన వైఎస్ షర్మిల
ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల తన కొడుకు పెళ్లి తర్వాత మరింత జోరుగా రంగంలోకి దిగారు. ఈరోజు నిరుద్యోగ సమస్యలపై ఛలో సెక్రెటేరీయేట్ కి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆమె జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పోల్చి ఎకిపారేసారు. చంద్రబాబు పాలనతో పోలిస్తే జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని షర్మిల అన్నారు.
YS Sharmila Slams
ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు. సచివాలయ, కాంట్రాక్టు పనులకు గాను 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. సీఎం జగన్ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పలు చెబుతున్నారన్నారు. ఉద్యోగాల కల్పనపై వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మెగా డీఎస్సీ పేరుతొ… దగా డీఎస్సీ తప్పన్నారు. ఉద్యోగాల కల్పన, ఉద్యోగ క్యాలెండర్లను అమలు చేయాలన్నారు. లేకుంటే ఛలో సెక్రెటేరీయేట్ కు వెళ్తామన్నారు. తాము శాంతియుతంగా సచివాలయానికి వెళ్తామని చెప్పారు. పోలీసులు కూడా తమ హక్కులను కాపాడాలని షర్మిల అన్నారు.
Also Read : Medaram Jatara : అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క ఆగమన పూజలు