NDA Meeting : మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం
ఎన్డీయే కూటమిలో చంద్రబాబుది కీలకపాత్ర. ఏపీలో కూటమి ఘనవిజయం తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి...
NDA Meeting : ఈరోజు (బుధవారం) కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఎన్డీయే పార్టీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పాటిల్, ఏక్ నాథ్ షిండే, జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి సహా పలువురు నేతలు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు ఉంటుందని భాగస్వామ్య పార్టీలు బీజేపీకి హామీ ఇచ్చాయి. చర్చల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.
NDA Meeting…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు (బుధవారం) ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమిలో చంద్రబాబుది కీలకపాత్ర. ఏపీలో కూటమి ఘనవిజయం తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. టీడీపీ మాజీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణంరాజు, కంభంపాటి రామ్మోహన్, ఇతర నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అలాగే ఈ నెల 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది.
Also Read : Minister Ponnam : పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని కీలక సూచనలిచ్చిన మంత్రి