Minister Kishan Reddy : జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది
సింగరేణి ప్రైవేటీకరణ కూడా పచ్చి అబద్ధం...
Minister Kishan Reddy : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్నారు. బుధవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలి ఇంటర్వ్యూలో మాట్లాడారు. విశాఖ ఉక్కు రేపో ఎల్లుండో ప్రైవేటీకరణ చేస్తామన్నది తప్పుడు ప్రచారం. కొందరు కావాలనే చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు సంబంధించిన పత్రాలు ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్ అవసరమని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Minister Kishan Reddy Comment
సింగరేణి ప్రైవేటీకరణ కూడా పచ్చి అబద్ధం. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా. గత 10 ఏళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనిని ప్రయివేటీకరించారా అని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చారని, చంద్రబాబు ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెడుతుంది అన్నారు.
Also Read : Congress : బీజేపీ పేపర్ లీకేజీ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు