MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు కొంత ఉరటనిచ్చిన రౌస్ అవెన్యూ కోర్ట్

ఎయిమ్స్ ఆస్పత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు....

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న ఆమెను మంగళవారం నాడు ఢిల్లీలోని ధీన్ దయాల్ ఆస్పత్రికి తరలించి సుమారు రెండు గంటలపాటు చికిత్స చేయగా కుదుటపడ్డారు. ఆస్పత్రి నుంచి మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కాగా.. కవితకు వైద్య పరీక్షల కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

MLC Kavitha Case Updates

ఎయిమ్స్ ఆస్పత్రిలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు.. కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కోర్టు సూచించింది. కాగా.. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. అయితే.. కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై-22 వరకు మరోసారి న్యాయస్థానం పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను మొత్తం పూసగుచ్చినట్లుగా న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు.

కాగా.. అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవిత(MLC Kavitha)కు పరీక్షలు నిర్వహించినట్లుగా కోర్టుకు సీబీఐ, ఈడీ తరఫున లాయర్లు వివరించారు. ఈరోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత తరపున న్యాయవాదులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఎయిమ్స్‌లో కవిత ఆరోగ్య పరీక్షలకు న్యాయస్థానం ఆదేశించింది. పరీక్షల అనంతరం ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఇవాళ లేదా రేపు కవితను కలవడానికి బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Telangana High Court : డీఎస్సీ వాయిదా పై కీలక విచారణ చేస్తున్న హై కోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!