Minister Narayana : సంపద సృష్టించడం అనేది ఓవర్ నైట్ లో చేసేది కాదు

మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి సత్యకుమార్‌….

Minister Narayana : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి ఏడాది రెండేళ్ల వరకు ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పేలా లేవు. సంపద సృష్టి అన్నది ఓవర్‌ నైట్‌లో సాధ్యమయ్యే పని కాదు. వాటి ఫలితాలు రావడానికి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో ఆర్థికంగా ముందుకెళ్లడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆయా శాఖల్లో నిధుల కొరత వేధిస్తోంది. తాజాగా మున్సిప‌ల్ కమిష‌న‌ర్లతో సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి నారాయ‌ణ(Minister Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ శాఖ ఖజానాను గత సర్కార్‌ పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు మంత్రి నారాయణ. కనీసం వసతులు కల్పించేందుకు కూడా డబ్బులు లేవన్నారు. నిధులకోసం సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశామని నారాయణ చెప్పారు.

Minister Narayana Comment

మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి సత్యకుమార్‌… కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌లను కలిసి రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. నిధుల కొరతను ఢిల్లీ పెద్దలకు వివరించారు. అలాగే మానవ వనరులపై పెరిగిన వ్యయాన్ని భరించడానికి వీలుగా రూ. 1,000 కోట్లు అందించాలని కేంద్ర పెద్దలను కోరారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకువెళ్లడం కత్తి మీద సాము. అయితే సీఎంగా సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. తన ఎక్స్‌పీరియన్స్ ఉపయోగించి.. స్మూత్‌గా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటు సంక్షేమాన్ని.. అటు అభివృద్ధిని సమపాళ్లలో ప్రజలకు అందించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలును బ్యాన్ చేశారు. అధికారులు ఆర్బాటాలకు వెళ్లకుండా.. ఉన్నంతలో సర్దుకోవాలని సంకేతాలిచ్చారు. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులను ఒక్కొక్కటి సెట్‌ చేసుకునే ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.

ఈ నేపథ్యంలోనే 2024 జూన్‌తో ముగుస్తున్న పౌర సౌకర్యాల ప్రాజెక్టు గడువును మరోసారి రెండేళ్లపాటు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ)ని కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి 24 గంటలపాటు తాగునీరు అందించడానికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, మురికి నీటి కాలువలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2019 నుంచి 2024 మధ్య వదిలివేసిన పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు మంత్రి.

Also Read : New Drug Test Kit : ఇకపై నార్కో-డ్రగ్స్ టెస్ట్ కోసం మరో కొత్త ఆయుధం

Leave A Reply

Your Email Id will not be published!