CM Chandrababu : రొట్టెల పండుగ సందర్భంగా వర్చువల్ సందేశం ఇవ్వనున్న ఏపీ సీఎం

నెల్లూరు ప్రతి ఏటా ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది...

CM Chandrababu : నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు(CM Chandrababu) వర్చువల్ సందేశం ఇవ్వనున్నారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తుల రాకతో నెల్లూరు కిటకిటలాడుతోంది. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండుగని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

CM Chandrababu…

నెల్లూరు ప్రతి ఏటా ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ రొట్టెల పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు హాజరవుతుంటారు. సుమారు 12 లక్షల మంది ఈ పండుగలో పాల్గొనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇది ముస్లిం పండుగ అయినా కూడా హిందువులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం విశేషం. హిందూ, ముస్లింలు కలిసి చేసుకునే ఈ పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఇక్కడ రొట్టెలు మార్చుకున్నా.. లేదంటే పట్టుకున్నా కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

బారాషాహి దర్గాకు రొట్టెల పండుగకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకుని వస్తారు. ముందుగా రొట్టెలు ఇచ్చి పుచ్చుకునే వారు స్వర్ణాల చెరువులో దిగి అక్కడ పవిత్ర జలాలను తలపై చల్లుకుని ఆ తరువాత రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక్కడ ఇచ్చి పుచ్చుకునే రొట్టెల్లోనూ పలు రకాలు ఉంటాయి. సంతానం, విద్య, ఆరోగ్యం, వివాహం, వ్యాపారం వంటి రొట్టెలు ఉంటాయి. వాటిని తీసుకుని వ్యక్తి కూడా అంటే సంతానం కావాలనుకునేవారు సంతానం రొట్టెను.. ఆరోగ్యం కావాలనుకునేవారు ఆరోగ్యం రొట్టెను అందుకుంటారు. కోరిక తీరితే తదుపరి ఏడాది వచ్చి తిరిగి రొట్టెలను పంచుతారు.

Also Read : Ex CM YS Jagan : వైఎస్ జగన్ వినుకొండ పర్యటన సందర్భంగా కీలక ప్రకటన చేసిన ఐజీ

Leave A Reply

Your Email Id will not be published!