TTD EO : తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఈవో శ్యామలారావు

ఆన్‌లైన్ టిక్కెట్ల జారీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు గుర్తించామన్నారు...

TTD EO : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజుల అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు. సీఎం సూచనలు మేరకు తిరుమల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

TTD EO Comment

ఆన్‌లైన్ టిక్కెట్ల జారీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు గుర్తించామన్నారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత ఉండేలా మార్పులు చేస్తామన్నారు. భక్తుల సమస్యలను మానిటరింగ్ చేసేందుకు ఓ వ్యవస్థ లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. క్యూ లైన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించానన్నారు. నిపుణుల సూచనలతో అన్నప్రసాదాల నాణ్యతను కూడా పెంచామని అన్నారు. క్యూ లైన్లలో భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని చెప్పారు. నెయ్యిలో నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిందని గుర్తించామని తెలిపారు. లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

Also Read : Rains in AP : వర్షాలతో స్తంభించిన ఉత్తరాంధ్ర రవాణా సంస్థ

Leave A Reply

Your Email Id will not be published!