CM Chandrababu : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం
భూసర్వే ద్వారా వివాదాలు పెరిగాయని... అందుకే హోల్డ్ చేసినట్లు వెల్లడించారు...
CM Chandrababu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటలింగ్ రిపీల్ బిల్లు 2024ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టగా… సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మాట్లాడుతూ.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారన్నారు. ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. న్యాయవాదులు కూడా దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగి పోయాయన్నారు. ఈ ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏదైనా భూమిని 22 ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అని.. ప్రభుత్వం ఒప్పకుంటే మరలా ప్రైవేటు భూమిగా మార్చేస్తారని తెలిపారు. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం ఈజీ అయిపోయిందని విమర్శించారు. భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోందన్నారు. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని.. రాజముద్ర వేస్తామని.. సీఎం బొమ్మవేసి అప్పట్లో పాస్ పుస్తకాలు ఇచ్చారని సీఎం వెల్లడించారు.
CM Chandrababu Comment
భూసర్వే ద్వారా వివాదాలు పెరిగాయని… అందుకే హోల్డ్ చేసినట్లు వెల్లడించారు. ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్ధితి ఉందన్నారు. ఎంతమంది హైకోర్టుకు భూ వివాదాలపై వెళ్లగలుగుతారని ప్రశ్నించారు. సాక్షిలో పనిచేసే వారినందరిని ప్రభుత్వంలో పెట్టారని విమర్శించారు. వారి గుమస్తాలను పెడితే మన జాతకాలు వాళ్లు రాస్తారన్నారు. ఎవ్వరైనా ఈ భూమి నాది అంటే అది ల్యాండ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లిపోతుంద్నారు. తద్వారా ప్రైవేటు ఆస్తులు లాగేయాలని చూశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చట్టం వారసత్వ చట్టానికి విరుద్దంగా ఉందన్నారు. ఈ చట్టంలో ఉన్న పలు సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టానికి సంబందించి తెచ్చిన 512 జీవోను రహస్యంగా ఉంచారని తెలిపారు. తాము వచ్చాక చట్టాన్ని రద్దు చేస్తామన్నామని అన్నారు.
ఇతర దేశాల్లో ఉన్నవారి భూములు రికార్డులు మార్చితే రెండేళ్ల గుర్తించకపోతే డీమ్డ్ టూ బి అని పెట్టేశారన్నారు. ఈ నల్ల చట్టానికి సభ్యలు అందరూ కలిసి మంగళంపాడాలి అని కొరుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకం అయిన నల్ల చట్టాన్ని రద్దుకు సభ అంగీకరించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ ప్లోర్ లీడర్ ప్రచార ఆర్బాటం, అధికార మదంతో ఈ చట్టాన్ని తెచ్చారని మండిపడ్డారు. అనంతరం ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు 2024ను ఏపీ శాసనసభ ఆమోదించింది.
Also Read : Harish Rao BRS : ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారో చెప్పాలి