Minister Ravi Kumar : వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి
విద్యుత్‌ను 24గంటల పాటు వినియోగదారులకు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు...
Minister Ravi Kumar : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో మరింత దుమారం రేపుతోంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన భార్య వాణి, కూతుళ్లిద్దరూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ విషయంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ వ్యవహారం వ్యక్తిగతమని, తామెక్కడా ఆయనను విమర్శించడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో మంత్రి రవికుమార్(Minister Ravi Kumar) మీడియాతో మాట్లాడుతూ.. తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. వైసీపీ నేతలు తమపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తమను దోషులుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Minister Ravi Kumar Comment
విద్యుత్‌ను 24గంటల పాటు వినియోగదారులకు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంట్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని అన్నారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో కరెంట్ చార్జీల ధరలు పెరిగాయని చెప్పారు. 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోందని వివరించారు. ఈ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న విషయంపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
Also Read : MLC Kavitha : ఈరోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ..