KTR BRS : మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో డొల్ల రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు...
KTR BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈ నెల 24న కమిషన్ ముందు తాను హాజరవుతానని ఆయన తెలిపారు. కమిషన్ ముందు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని వివరిస్తానని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి కమిషన్‌కి వివరిస్తా. ఏం చర్యలు తీసుకున్నారో అడుగుతా. నేను బహిరంగ క్షమాపణ చెప్పినా, ఎందుకు నోటీస్ ఇచ్చారో తెలియట్లేదు” అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR BRS Comment
కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో డొల్ల రాజకీయాలు చేస్తోందని కేటీఆర్(KTR) విమర్శించారు. ” ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయికి వెళ్తాం. గ్రామ స్థాయి నుంచి రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజక వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు అందజేస్తాం. ఆ తర్వాత సచివాలయంలో అధికారులకు ఇస్తాం. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మాత్రమే రుణ మాఫీ జరిగింది. ఇంకా 60శాతం మంది రైతులకు కాలేదు. వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల మీద ఎలా దాడులు చేస్తారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేసిన వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫాక్స్‌కాన్ కర్ణాటకలో చైనా తర్వాత అతి పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ బెంగళూరులో 40 వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకుంది. కాంగ్రెస్ మాటల వల్ల ఫాక్స్‌కాన్ కంపెనీ ఉందా పోయిందా వివరణ ఇవ్వాలి. ప్రధాని మోదీ పేరెత్తాలి అంటేనే సీఎం రేవంత్ గజ గజ వణుకుతున్నారు. బీజేపీ జెండా కప్పుకునే చనిపోతా అని రేవంత్ రెడ్డి.. మోదీతో అన్నారట. అందుకే మోదీని ఏమనట్లేదు” అని కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Also Read : TG CS Shanthi Kumar : ఈ దసరా నుంచి ప్రారంభం కానున్న స్కిల్ యూనివర్సిటీ కోర్సులు