AAP JK Elections : జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్
జమ్మూ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆప్..
AAP JK Elections : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదివారంనాడు ప్రకటించింది. వీటిలో పుల్వామా, రాజ్‌పోరా, దేవ్సర్, దూరు, దోడా, దోడా వెస్ట్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా పుల్వామా నుంచి ఫయజ్ అహ్మద్ సోఫి, రాజ్‌పోరా నుంచి ముదసిర్ హసన్, దేవ్సర్ నుంచి షేక్ ఫిదా హుస్సేన్, దూరు నుంచి మొహిసిన్ షఫకత్ మీర్, దోడా నుంచి మెహ్రాజ్ దిన్ మాలిక్, దోడా వెస్ట్ నుంచి యాసిర్ షఫి మట్టూ, బనిహాల్ నుంచి ముదసిర్ అజ్మత్ మీర్ ‘ఆప్’ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
AAP JK Elections….
కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ఆప్ ప్రకటించిది. వారిలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్టీ నేతలు మనీష్ సిసోడియా, ఆప్ మంత్రులు అతిషి, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి.
Also Read : Minister Chirag Paswan : ఎల్ జె పి(రామ్ విలాస్) అధ్యక్ష పదవికి మరోసారి చిరాగ్ పాశ్వాన్