Minister JP Nadda : బెంగాల్ పోలీసులపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా
కోల్‌కతాలో విద్యార్ధులు కదం తొక్కారు. డాక్టర్ హత్యాచారం ఘటనపై తమదైన శైలిలో నిరసన తెలిపారు...
Minister JP Nadda : పశ్చిమ బెంగాల్ పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వైఖరిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా(Minister JP Nadda) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోల్‌కతాలో పోలీసుల అత్యుత్సాహా చర్యల పట్ల ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి వ్యక్తికి కోపం తెప్పించేలా ఉన్నాయన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్, కోల్‌కతా సోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై జేపీ నడ్డా మండిపడ్డారు. బెంగాల్లో రేపిస్టులు, నేరస్థులకు సహాయం చేయడానికి ఇచ్చే విలువ, మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఇవ్వడం లేదన్నారు.
Minister JP Nadda Slams
కోల్‌కతాలో విద్యార్ధులు కదం తొక్కారు. డాక్టర్ హత్యాచారం ఘటనపై తమదైన శైలిలో నిరసన తెలిపారు. ఆందోళనకారులు బెంగాల్ సెక్రటేరియట్ ఉన్న నబానా వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. నబానా వైపు వచ్చే అన్ని రోడ్లను దిగ్భంధించారు పోలీసులు. ఒక్కరిని కూడా అటు వైపు అనుమతించలేదు. విద్యార్ధులకు తోడుగా పలు బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రజల హక్కు అని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(Minister JP Nadda) అన్నారు. డాక్టర్‌పై అత్యాచారం కేసులో నిందితులను సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కోల్‌కతాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి, భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీసు కమిషనర్ వ్యవహారించిన తీరును సమర్థిస్తోంది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కోల్‌కతా పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మహిళల భద్రతకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee)పై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రశ్నలు సంధించింది. బెంగాల్ ప్రభుత్వం మహిళల భద్రతా చర్యలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రారంభించేందుకు రాష్ట్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. ఈమేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు కేంద్రమంత్రి. మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించి కఠినచర్యలు తీసుకున్నారో వివరించాలని కోరారు.
ఇదిలావుండగా, తాజాగా మంగళవారం ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థుల ‘నబన్న మార్చ్’లో భాగంగా సచివాలయ భవనాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. దీంతో కోల్‌కతా పోలీసులు సచివాలయం చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. హౌరాలో ఉన్న నబన్న భవన్ రాష్ట్ర సచివాలయం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఛత్ర సమాజ్ అనే సంస్థ ఈ మార్చ్‌ను నిర్వహించింది. ఈ నిరసనలకు బీజేపీ(BJP) కూడా మద్దతు తెలిపింది. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు ఎలాంటి పార్టీ బ్యానర్ లేకుండా సోషల్ మీడియాలో నిరసనలో పాల్గొనాలని సామాన్య ప్రజలను ఆహ్వానించాయి. కాగా, శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయకూడదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి.ఆనంద్ బోస్ సోమవారం రాత్రి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలో విద్యార్ధులు కదం తొక్కారు. డాక్టర్ హత్యాచారం ఘటనపై తమదైన శైలిలో నిరసన తెలిపారు. నలు దిక్కుల నుంచి సెక్రటేరియట్ నబానాను ముట్టడించేందుకు ప్రయత్నించారు. 15 నిముషాలకు ఓసారి విడతల వారిగా విద్యార్ధులు దూసుకురావడం.. 15 నిముషాలకు ఓసారి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో భద్రత కోసం 97 మంది సీనియర్ అధికారుల పర్యవేక్షణలో మొత్తం 2 వేల మంది పోలీసులను మోహరించినట్లు సమాచారం. ఇది కాకుండా, కోల్‌కతా, హోర్వాను కలిపే ప్రదేశాలలో సుమారు 4,000 మంది పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్, జిల్లా విభాగాలకు చెందిన పోలీసు సిబ్బంది మోహరించారు.
అయితే, కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్‌ను ముట్టడించాయి విద్యార్ధి సంఘాలు . విద్యార్ధులకు , పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణ చెలరేగింది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు, బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళకారుల పైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు.
కాగా, జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమత ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు..ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికి , భాష్ఫవాయువు ప్రయోగించినప్పటికి ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. హౌరా బ్రిడ్జి దగ్గర బైఠాయించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులపైకి ఆందోళకారులు దాడులకు తెగబడ్డారు. గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కోల్‌కతాలో లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. డాక్టర్లు విధులను బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు.
Also Read : KTR Vs Bandi Sanjay : కవిత బెయిల్ అంశంలో బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటిఆర్