Karnataka Home Minister : కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వరన్ ను చుట్టుముట్టిన వివాదాలు

ఏకంగా రౌడీషీటర్లు జైలుకు వెళ్లి రిసార్టు తరహాలో సరదాగా గడిపిన ఫొటోలు, వీడియో కాల్‌ వైరల్‌ అయ్యాయి...

Karnataka Home Minister : ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రి(Home Minister)గా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌కు వివాదాలు చుట్టుముడుతున్నాయి. తరచూ ఏదో ఒక వివాదానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో నటుడు దర్శన్‌ అరెస్టు అయినప్పటి నుంచి నిత్యం వివాదాలు సాగుతూనే ఉన్నాయి.

Karnataka Home Minister…

ఏకంగా రౌడీషీటర్లు జైలుకు వెళ్లి రిసార్టు తరహాలో సరదాగా గడిపిన ఫొటోలు, వీడియో కాల్‌ వైరల్‌ అయ్యాయి. ప్రతిపక్ష నాయకులతోపాటు ప్రజల నుంచి పరమేశ్వర్‌(Parameshwaran) విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి పరప్పన జైలులోని 13 మందిని వేర్వేరు జైళ్లకు మార్పు చేశారు. నిజాయితీ, నిష్పక్షపాత అధికారులను జైళ్ల శాఖ డీఐజీగా నియమించారు. మరోవివాదంలో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ఎంపీ ప్రజ్వల్‌, ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ వివాదాలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చింది.

హాసన్‌లో ప్రజ్వల్‌కు సంబంధించిన రాసలీలల పెన్‌డ్రైవ్‌లు వైరల్‌ కావడం, ఆ తర్వాత అతడు విదేశాలకు తరలిపోవడం, బాధితురాలిని కిడ్నాప్‌ చేసిన కేసులో రేవణ్ణను అరెస్టు చేయడం వంటివి కొనసాగాయి.
మహర్షి వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌కు సంబంధించి రూ. 187 కోట్ల అవినీతి వెలుగులోకి రావడంతో సిట్‌ విచారణ జరపాల్సి వచ్చింది. మంత్రి నాగేంద్రకు క్లీన్‌చిట్‌ లభించినా పరమేశ్వర్‌(Parameshwaran) మాత్రం పలు విమర్శలు ఎదుర్కొన్నారు. హుబ్బళ్లిలో విద్యార్థిని నేహా హిరేమఠ్‌ను కళాశాలలోనే ఫయాజ్‌ అనే యువకుడు కిరాతకంగా హతమార్చాడు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ సొంతపార్టీ నేతలతోపాటు హోంశాఖ మంత్రిపైనా మండిపడిన విషయం తెలిసిందే. హుబ్బళ్లిలో అంజలి అంబిగెర హత్యకేసు రాజకీయరంగు పులుముకుంది.

శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. సీఎం, మంత్రుల భిన్నమైన వ్యాఖ్యలతో హోంశాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. దేశమంతటా సంచలనం కలిగించిన వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కెఫెలో బాంబుపేలుళ్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి మాయనిమచ్చగా మారింది. సీఎం, మంత్రులు ఈ వివాదంలోనూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. సీసీబీ ద్వారా దర్యాప్తునకు ఆదేశించగా ఎన్‌ఐఏ రంగంలోకి దిగడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

విధానసౌధలో రాజ్యసభ సభ్యుడిగా నాసిర్‌హుసేన్‌ ఎన్నికైన సందర్భంలో పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ చేసిన నినాదాలు అన్ని వర్గాల ద్వారా ప్రభుత్వానికి విమర్శలు వచ్చాయి. హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌(Parameshwaran), మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌తోపాటు పలువురు నకిలీ వీడియోలంటూ ప్రచారం చేశారు. ఫోరెన్సిక్‌లో వాస్తవమని తేలడంతో విమర్శలకు దారితీసింది. హావేరిలో సామూహిక అత్యాచారం కేసులో రాజీకోసం కొందరి ప్రయత్నాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయి. బెళగావి జిల్లా వంటమూరిలో మహిళను వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన జాతీయస్థాయిలో విమర్శలకు దారితీసింది. ఉడుపి కళాశాలలో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణలోనూ హోం మంత్రికి తలదించుకునేలా చేసింది. తాజాగా ముడా వివాదం తలెత్తిన తర్వాత బీజేపీ, జేడీఎ్‌సలకు చెందిన నేతలపై పాతకేసులను తిరగతోడే ప్రయత్నం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది.

Also Read : Bengal Bandh : ఈరోజు బెంగాల్ లో 12 గంటల బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!