Minister Pemmasani : వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి
కాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి...
Minister Pemmasani : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Minister Pemmasani) వరద ప్రబావత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఉప్పలపాడులో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో కాలువ మరమ్మత్తులు చేయలేదని రైతులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Minister Pemmasani)కు ఫిర్యాదు చేశారు. కాలువలు సక్రమంగా లేకపోవడం వల్లే పొలాలు మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాది హామీ పధకం దుర్వినియోగం అయిందని, కాలువల్లో పనులు చేయకుండానే వైసీపీ నేతల దోచుకున్నారని రైతులు ఆరోపించారు. గుంటూరు చానల్‌కు అధిక వరద వల్ల గండ్లు పడ్డాయని, గుంటూరు చానల్‌ను కూడా త్వరలో ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని మంత్రి పెమ్మసాని రైతులకు భరోసా ఇచ్చారు.
Minister Pemmasani Visit
కాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వాతావరణ శాఖ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రిగేషన్ శాఖ ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి అధికారులు వరకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
బుడమేరు స్థాయిని మించి పొంగి ప్రవహిస్తుండటంతో విజయవాడ నగరంతో పాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని భేరీజు వేసుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి, కంతేరు, కొప్పురావూరు, ప్రాంతాల్లో పడిన భారీవర్షాలకు హైవేపై నీరు ప్రవహించి గుంటూరు ఛానెల్లో పలుచోట్ల గండ్లు పడి , నంబూరు, కాకాని గ్రామాల్లోకి వరద నీరు చేరిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
Also Read : Minister Nara Lokesh : ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్