AP Deputy CM : షెడ్యూల్ కు ముందే ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల పర్యటనలో కీలక మార్పులు

అయితే ఉపముఖ్యమంత్రి కాలిబాటన తిరుమలకు వెళ్లటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు...

AP Deputy CM : తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. దీక్ష విరమణ కోసం తిరుమలకు చేరుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం పవన్ అలిపిరి చేరుకుని మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయితే ఉపముఖ్యమంత్రి కాలిబాటన తిరుమలకు వెళ్లటానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్యూరిటీ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గానే తిరుమలకు వెళ్లాలని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు నేతలు చెపుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుమలలో గాయత్రి సదన్‌లో రాత్రికి బస చేయనున్న డిప్యూటీ సీఎం(AP Deputy CM).. రేపు (అక్టోబర్ 2) శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు అంతా తిరుమలలోనే పవన్ ఉండనున్నారు. దీక్ష విరమించిన తరువాత ఎల్లుండి (అక్టోబర్ 3) సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్న వారాహి బహిరంగ సభలో డిప్యూటీసీఎం పవన్(AP Deputy CM) పాల్గొననున్నారు.

AP Deputy CM Tirumala…

కాగా.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్.. విరమణ కోసం మూడు రోజుల తిరుపతి తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ కంటే గంట ముందే రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేరుకున్నారు. విమానాశ్రయం లోపల నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో అలిపిరికి బయలుదేరి వెళ్లారు. అయితే అలిపిరిలో కాలిబాటన నడిచి తిరుమలకు వెళ్లాలనుకుని పవన్ నిర్ణయంచగా… పోలీసులు అనుమతించని నేపథ్యంలో నేరుగా అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి వెళ్లినట్లు నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా… శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజులపాటు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమలకు చేరుకున్న పవన్ స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు.

Also Read : Kadambari Jethwani : ముంబై నటి కాదంబరి కేసుపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!