CM Chandrababu : చెత్తపన్నుపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ సెంటర్లను గతంలో తాము ఏర్పాటు చేశామని....

CM Chandrababu : ఏపీలో చెత్త పన్నుపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ప్రకటించారు. ‘‘ చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం.. వచ్చే క్యాబినెట్‌లో పెట్టి ఆదేశాలు ఇస్తాం.. అధికారులు కూడా చెత్త పన్నును ఇకపై వసూలు చేయవద్దు’’ అంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు మచిలీపట్నంలో స్వచ్చ సేవ ప్రజావేదిక సభలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు.

CM Chandrababu Comment

గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్(Solid Waster) సెంటర్లను గతంలో తాము ఏర్పాటు చేశామని.. అయితే చెత్తను తీసుకుపోవడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ముఖానికి వేసి ఊరంతా తిప్పితే బుద్ది వచ్చేదని విరుచుకుపడ్డారు. ‘‘ ఉదాత్తమైన మనసుతో షెడ్‌లు పెడితే… కేంద్రం డబ్బులు ఇచ్చింది. వాటిని కూడా ఇష్టం వచ్చినట్లు చేసి నిధులు లేకుండా చేశారు. కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు రెండు మాత్రం పని చేస్తున్నాయి. మిగతా అన్ని ఫ్లాంట్లు పనికి రాకుండా చేశారు. రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదు.. ఎన్ని ప్లాంట్లు అయినా పెడతాం. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తాం. ప్రతిఒక్కరూ స్వచ్చ సేవకులు కావాలి.. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధించాలి. గాంధీ జయంతిన 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌(AP)గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలి’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.

మొన్న విజయవాడ(Vijayawada)లో వచ్చిన వరదలలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. బుడమేరు గండ్లు పూడ్చకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు వచ్చిందన్నారు. విజయవాడ(Vijayawada) మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. ఆరేడు అడుగుల నీరు రోడ్లపైనా, ఇళ్లల్లో నిలిచిందని… నీరు పోయే పరిస్థితి లేక.. పై నుంచి వస్తున్న నీటితో తల్లడిల్లామని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. లక్షలాది మంది ప్రజలకు అవసరమైన సేవలు అందించామన్నారు. ప్రజల కోసం బురదలో నడిచానని, ప్రొక్లైనర్ ఎక్కా.. వరద నీటిలోకి వెళ్లామని వెల్లడించారు. ప్రజలకు అన్ని సదుపాయాలు అందించి, వరద నీరు పంపాకే తాను బయటకు వచ్చినట్లు తెలిపారు.

‘‘నా ఆలోచనలకు తగ్గట్లుగా స్వచ్చ సేవకులు అద్భతంగా పని చేశారు. డ్రైనేజీ, మురుగు నీరు కలిసి పోయి గందరగోళంగా మారింది. కార్మికులు, సేవకుల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలను వారు కాపాడారు. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీ బాధితులకు ఇచ్చాం. ప్రతి ఇంటికి 25 వేలు రూపాయలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. కష్టాలు, విపత్తులు వస్తే.. మనవతా ధృక్పథంతో ఆలోచన చేయాలి. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు పది వేలు ఇచ్చాం. మొదటి అంతస్తులో ఉన్న వారికి కూడా పది వేలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం అందించిన సాయంతో.. వరద బాధితులు నేడు ధీమాగా ఉన్నారు. వరద బాధితుల కోసం రూ.450 కోట్లు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించడం కూడా ఒక చరిత్ర. నా జీవితంలో ఇంత సాయం గతంలో ఎన్నడూ చూడలేదు. మనసున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి సాయం చేశారు’’ అంటూ చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.

‘‘నేడు మహాత్మాగాంధీ సేవలును గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నాం. ఆయన స్పూర్తితో స్వచ్ఛత కార్యక్రమానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలి. చల్లపల్లి ప్రసాద్ వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే. సేవా భావంతో పని చేసే వారిని మనం అభినందించాలి. మహాత్మాగాంధీ మంచి చేశారు కాబట్టే.. నేటికీ ఆయనను మననం చేసుకుంటున్నాం. అహింసా సిద్ధాంతంతో పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చారు. ఆయన సిద్ధాంతం భావితరాలకు కూడా ఆదర్శం. ప్రజా హితమైన ఆలోచనలతో అందరూ ముందుకు వెళ్లాలి. ఆనాడే స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి గాంధీజీ. ఈ ప్రాంతంలో పుట్టిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. నేటికీ అదే మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతోంది. స్వతంత్ర భారతావనికి ఊతమిచ్చి. ఉద్యమ బాట పట్టిన ప్రాంతమిది. నేడు కొంతమంది మంది స్వార్థపరులు స్కూల్స్‌ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు’’ అని మండిపడ్డారు.

‘‘హిందూ జాతీయ కళాశాలను ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేస్తుంది. కృష్ణా పత్రిక ముట్నూరి కృష్ణారావు, జెండా కర్ర తోట నరసయ్య, బోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి వారు ఈ ప్రాంతం నుంచి వచ్చారు. పింగళి వెంకయ్య పేరుతో మెడికల్ కాలేజీకి పేరు పెడతామని హామీ ఇస్తున్నా. భావితరాలకు మనం ఇచ్చే స్పూర్తి దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఈ కార్యక్రమం నా మనసుకు చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం. గతంలో క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి, నెలలో రెండో శనివారం అందరూ పాల్గొనేలా చేశాం. చెట్లు నరికేయడం, చెత్త రోడ్ల మీద వేయడం వంటివి ఇటీవల చూశాం. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన దూర దృష్టికి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. 140కోట్ల భారత దేశ జనాభా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

మనం తాగే నీరు, తినే తిండిపై మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఆ రోజు మోడీ పది మంది ముఖ్యమంత్రులతో సబ్ కమిటీ వేశారు. స్వచ్ఛ భారత్ సబ్ కమిటీకి నేనే ఆనాడు ఛైర్మన్‌ను. స్వచ్ఛ సేవకులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ రిపోర్టు నేటికీ పని చేస్తుంది.. అమలు అవుతుంది. 2015 లో ఏపీ(AP)లో స్వచ్ఛ భారత్‌కు మనమే శ్రీకారం చుట్టాం. పార్కులు అబివృద్ది చేశాం. రోడ్ల వెంట చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం తెచ్చాం. 2019 నుంచి ఈ రాష్ట్రంలో చెత్త పేరుకు పోయింది.. చెట్లు నరికేశారు. చెత్త వద్దే పిల్లులు ఆడుకుంటే. వారి ఆరోగ్యం పరిస్థితి ఏమిటి. చెత్త నుంచి కరెంటును తయారు చేసి, సంపదను సృష్టించే కార్యక్రమం చేశాం. చెత్తపై అవసరమైతే మళ్లీ రీ సైక్లింగ్ కూడా మేము చేశాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్పూర్తితో మనం ముందుకు వెళ్దాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పేర్కొన్నారు.

Also Read : Deputy CM Udhayanidhi : తొలి విడతగా 100 మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు..

Leave A Reply

Your Email Id will not be published!