TTD EO : ఏడుకొండలవాడి సేవలు, స్పెషల్ దర్శనాలపై టీటీడీ ఈవో కీలక ప్రకటన

1250 మంది విజిలేన్స్, 3900 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు...

TTD : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని.. ఇప్పటికే ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు.. రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. గరుడ వాహన సేవ 8వ తేదీ రాత్రి జరుగుతుందన్నారు. వాహన సేవ దర్శనంతో పాటు మూలవిరాట్టు దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు.

TTD EO Comment

1250 మంది విజిలేన్స్, 3900 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 24 ప్రాంతాల్లో 4 వేల వాహనాలు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ(TTD) ఈవో పేర్కొన్నారు. వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు, 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 155257 నెంబర్‌తో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. 21 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 160 కళాబృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయన్నారు.

గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహన సేవ ఉంటుందని తెలిపారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడక దారులు తెరిచి ఉంచుతామని ప్రకటించారు. నాలుగు వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామన్నారు. రేపు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఆపై 2025 టీటీడీ(TTD) క్యాలెండరు, డైరీలను ఆవిష్కరిస్తారని తెలిపారు. 5వ తేదీన ఉదయం రూ.13.45 కోట్లతో నిర్మించిన వకుళమాత అన్నదాన సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని టీటీడీ ఈవో శ్యామలారావు పేర్కొన్నారు.

Also Read : CM Revanth Reddy : కేసీఆర్ సర్కార్ చేసిన నిర్వాకాన్ని మేము సరిదిద్దుతున్నాం

Leave A Reply

Your Email Id will not be published!