CM Chandrababu : తిరుమల వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం

కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూనే… ఆర్భాటం, అనవసర వ్యయం వద్దంటూ చంద్రబాబు సూచించారు..

CM Chandrababu : తిరుమల కొండపై ఇకనుంచి వీఐపీ దర్శనాలు ఉండవా…? వీఐపీ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందా…? అంటే.. అవుననే వినిపిస్తోంది.. తిరుమలలో ఇంతకుముందో లెక్క.. ఇప్పుడో లెక్క అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులూ సామాన్యులే అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.. కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా సామాన్య గోవిందం అన్నట్లుగానే ముందుకెళ్లాలన్నారు. అందరినీ ఒకేలా చూస్తేనే… తిరుమల పవిత్రత రెట్టింపవుతుందన్నారు. తిరుమల పద్మావతి అథితి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహంచిన చంద్రబాబు(CM Chandrababu).. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

CM Chandrababu Comment

కొండపై వీఐపీ సంస్కృతి తగ్గాలంటూనే… ఆర్భాటం, అనవసర వ్యయం వద్దంటూ చంద్రబాబు సూచించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించాలన్న ఆయన… దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండొద్దన్నారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించొద్దని స్పష్టం చేశారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా టీటీడీ సేవలు ఉండాలన్నారు. లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని పేర్కొన్నారు. అటవీ ప్రాంత విస్తీర్ణం 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.ఇక వీఐపీ దర్శనాలపై చంద్రబాబు లేటెస్ట్‌ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. వీఐపీ దర్శనాలకు పూర్తిగా చెక్‌ పెడతారా…? అన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : మూసి నిర్వాసితులను ఆదుకునే అంశంపై స్పందించిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!