India Govt : రాష్ట్రాల వారీగా పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్ర సర్కార్

ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ. 1,78,173 కోట్లు రిలీజ్ చేసింది...

India Govt : కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.11 వేల కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు విడుదలయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,78,173 కోట్లు రిలీజ్ చేశారు. అక్టోబరు, 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

India Govt Reelease..

ముందస్తు వాటాగా రూ. 89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ. 1,78,173 కోట్లు రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ వ్యయాలకు ఆర్థిక సాయం అందించడానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపింది.

Also Read : Turkish Airlines : మార్గమధ్యంలో టర్కిష్ ఎయిర్లైన్స్ పైలట్ దుర్మరణం

Leave A Reply

Your Email Id will not be published!