EVMs : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ ఈవీఎంలపై కీలక ప్రకటన చేసిన ఈసీ
కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తోంది...
EVM : ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్(EC) రాజీవ్ కుమార్ మరోసారి తోసిపుచ్చారు. ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రజలే ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తారని అన్నారు. ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌గా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై బీజేపీయేతర పార్టీలు తరచు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై సీఈసీ స్పందించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలోనూ ఇదే ప్రశ్నలు అడిగితే మళ్లీ మళ్లీ ఇదే సమధానమిస్తామన్నారు.
EVMs Update
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలతో పాటు 3 లోక్‌సభ స్థానాలు, 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే వీలుంది. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్, పశ్చిమబెంగాల్లోని జసిర్‌హట్ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తోంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 81 స్థానాలున్న జార్ఖాండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగుస్తుంది. మహారాష్ట్రలో బిజీపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉండగా, జార్ఖాండ్‌లో జెఎంఎం అధికారంలో ఉంది.
Also Read : CM Revanth Reddy : రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పనిచేస్తాం