Kodandaram : కెసిఆర్ ప్రభుత్వ విధానాలవల్ల నిరుద్యోగ యువత పెరిగిపోయారు

తమ పార్టీ అప్పుడు, ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందని తెలిపారు...

Kodandaram : బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం)నిజామాబాద్‌లో అభినందన సభ జరిగింది. ఈ సభలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…గ్రూప్ – 1 ఎగ్జామ్స్ మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు. జీవో 55, 29 ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలని చెప్పారు.

Kodandaram Comment

తమ పార్టీ అప్పుడు, ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై పోరాడుతూనే ఉందని తెలిపారు. తమ ఆందోళనలు, సూచనలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. నిరుద్యోగులను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.

Also Read : WTC Final : భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరేందుకు అవకతవకలు

Leave A Reply

Your Email Id will not be published!