AP Deputy CM : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిట్ కోర్టు నుంచి నోటీసులు

ఆ ఆరోపణలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచాం...

AP Deputy CM : తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే కల్తీ నెయ్యి అంశం ఇంకా కాకరేపుతూనే ఉంది. పంది కొవ్వు ఉపయోగించారని తెలిసి శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. తిరుపతి లడ్డూపై రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM) కూడా స్పందించారు. గత పాలక మండలి కల్తీ నెయ్యి ఉపయోగించిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ ఇమ్మనేని రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

AP Deputy CM Got Notices

భక్తులకే కాదు.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా తిరుపతి లడ్డూ పంపించారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ చేసిన కామెంట్లతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం జంతువులు కొవ్వు కలిపారని అనడం దారుణం. ఆ ఆరోపణలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచాం. లడ్డూ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానెళ్ల నుంచి ఆ కామెంట్లను తొలగించాలి అని’ పిటిషనర్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూకు సంబంధించి ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి వై రేణుకతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీచేసింది. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలతో రాజకీయ దుమారం నెలకొంది. ఆ అంశంపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో.. న్యాయస్థానం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది.

Also Read : KTR : కాంగ్రెస్, బీజేపీ నేతల రహస్య ఒప్పందాలు బయటకు వస్తాయి

Leave A Reply

Your Email Id will not be published!