Jharkhand Elections : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన జేఎంఎం

బర్‌హైత్ (ఎస్‌టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు...

Jharkhand : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జార్ఖాండ్ ముక్తి మోర్చా(JMM) బుధవారంనాడు విడుదల చేసింది. బర్‌హైత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు విడతలుగా జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

Jharkhand Elections..

బర్‌హైత్ (ఎస్‌టీ) నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా హేమంత్ సోరెన్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి సైమాన్ మాల్టేపై 25,740 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గాండేయ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై 27,149 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో గాండేయ్ ఉప ఎన్నిక జరిగింది.

కాగా, జేఎంఎం తాజాగా విడుదల చేసిన 35 మంది అభ్యర్థుల్లో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. ఆనయ డుంకా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నల నియోజకవర్గం నుంచి జార్ఖాండ్ అసెంబ్లీ స్పీకర్ మహతో పోటీ చేస్తున్నారు. గార్వా నియోజకవర్గం నుంచి మంత్రి నీలేష్ ఠాకూర్, గిరిదిహ్ నుంచి సోను సుదివ్య, డుమ్రి నుంచి బేబి దేవి పోటీలో ఉన్నారు. 2019లో హేమంత్ సోరెన్ డుంకా, బర్‌హైత్ నియోజకవర్గాల్లో పోటీచేసి రెండింట్లోనూ గెలవడంతో బర్‌హైత్‌ను తనవద్దే ఉంచుకుని డుంకా సీటును వదులుకున్నారు. ఆ సీటులో సీఎం సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మరాండిపై 6,842 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

Also Read : Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను వెల్లడించిన ఎన్సీపీ

Leave A Reply

Your Email Id will not be published!