Phone Tapping Case : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు తిరుపతన్న
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే...
Phone Tapping : తెలంగాణ రాష్ట్రంలో పోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి ప్రతీసారీ నిరాశే మిగులుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping)లో బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ పోలీసు అధికారి తిరుపతన్న ఉన్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Phone Tapping Case Updates
ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తిరపతన్నకు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తిరుపతన్న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి మూడు నెలలు అయిన తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది. తరుపరి విచారణను వచ్చే నెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.
కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు ఇటీవల హైకోర్టు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించింది. తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే… దాన్ని వల్ల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేయాలని ఖాకీలను కోర్టు ఆదేశించింది. అలాగే తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేస్తూ.. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంను ఆశ్రయించారు. మరి తిరుపతన్న బెయిల్ వస్తుందా.. లేదా తెలియాలంటే తదుపరి విచారణ వరకు వేచి చూడాల్సిందే.
Also Read : Tammineni Veerabhadram : కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని