BJP MP Arvind : ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ సర్కార్ ఉంది

ఆరు గ్యారెంటీలు సైతం అమలు చేయలేదంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు...

MP Arvind : తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపూరీ అర్వింద్ నిప్పులు చెరిగారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ ధర్మపూరి అర్వింద్(MP Arvind) మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్టేసి.. రైతులను రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీతోపాటు రూ. 500 బోనస్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

BJP MP Arvind Comment

ఆరు గ్యారెంటీలు సైతం అమలు చేయలేదంటూ రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు కూడా తెరవ లేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. ఇక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న కులగణన పకడ్బందీగా చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పాదయాత్ర చేస్తే చీపుర్లు, చెప్పులతో కేటీఆర్‌కు స్వాగతం పలకాలని ఈ సందర్బంగా ప్రజలకు అర్వింద్ సూచించారు. ఇక కేటీఆర్ త్వరలో చేపట్టనున్న ఈ యాత్ర.. పాదయాత్రా? లేకుంటే పదవులు యాత్రనా? అని ఎంపీ ధర్మపూరి అర్వింద్(MP Arvind) వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఆయన చేసేది ఏ యాత్రతో వెంటనే స్పష్టం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను అర్వింద్ డిమాండ్ చేశారు.

ఎన్నిక సమయంలో ఇచ్చిన అన్ని హామీలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్‌ అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అలాగే వక్ఫ్ బోర్డు చట్టం అత్యంత దుర్మార్గపు చట్టమని పేర్కొన్నారు. పార్లమెంట చట్టాలను ఉల్లంఘిస్తే తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తానంటూ హిందూ దేవుళ్ల మీద ఒట్టేసిన రేవంత్ రెడ్డి.. ముస్లిం దేవుళ్లు మీద ఎందుకు వేయ్యలేదో చెప్పాలని ఈ సంద్భంగా సీఎం రేవంత్‌ను డిమాండ్ చేశారు.

Also Read : Minister Jupally : తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దే..

Leave A Reply

Your Email Id will not be published!