AP TET Results : సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టెట్ ఫలితాలు విడుదల

కాగా.. గత నెలలో (అక్టోబర్‌) ఏపీ టెట్ -2024 పరీక్షను నిర్వహించారు...

AP TET : ఏపీ టెట్ – 2024 ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారన్నారు. (https://cse.ap.gov.in) . నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

AP TET 2024 Results…

కాగా.. గత నెలలో (అక్టోబర్‌) ఏపీ టెట్ -2024 పరీక్షను నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్ష రాశారు. 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. అయితే త్వరలోనే 16,347 పోస్టులతో మెగాడీఎస్సీ నోటిఫికేషన్‌‌ను సర్కార్ జారీ చేయనున్న నేపథ్యంలో టెట్‌ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు టెట్‌ అర్హత సర్టిఫికెట్‌ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

Also Read : TG High Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పాల్

Leave A Reply

Your Email Id will not be published!