Minister Vasamshetty : వైసీపీ నేతలపై భగ్గుమన్న మంత్రి వాసంశెట్టి సుభాష్

జగన్ తీరుతో తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు అందరూ బాధపడుతున్నారని పేర్కొన్నారు...

Minister Vasamshetty : వైసీపీ శ్రేణులపై కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetty) తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ గ్రామ సింహాలు మొరుగుతూనే ఉన్నాయన్నారు. అందుకే కృష్ణా జిల్లాకు రావాలంటే కొంచెం భయపడ్డానంటూ ఆయన కామెంట్స్ చేశారు. NDA కూటమి సమిష్టిగా ఉంది కాబట్టే తాము భారీ మెజార్టీలతో గెలిచామని..ఇప్పుడు కూడా తామంతా సమిష్టిగానే ముందుకు వెళుతున్నామని అన్నారు.

Minister Vasamshetty Slams..

జగన్ తీరుతో తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలు అందరూ బాధపడుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ఓ హత్య కేసులో ఉంటే కనీసం పలకరింపుకు కూడా జగన్ రాలేదని అన్నారు. జగన్ ప్యాలెస్ లకు పరిమితమవ్వడమే తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. NDA కూటమి ఐక్యత గురించి బాధ పడాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని, మంచి వైద్యం అందుతుందేమోనని లండన్ వెళుతున్నాడని సెటైర్లు వేశారు.

కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అయితే, కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మాజీ మంత్రి విశ్వరూప్‌ విమర్శలు గుప్పించారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్‌ ఆజ్యం పోస్తోందని.. రాజకీయ కక్షతోనే తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. హత్య కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని, ఎఫ్‌ఐఆర్‌లో కూడా తన కొడుకు శ్రీకాంత్ పేరు ఎక్కడా లేదని వివరించారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Minister Ponnam : అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తారా అంటూ కేంద్ర మంత్రులకు సవాల్ విసిరిన పొన్నం

Leave A Reply

Your Email Id will not be published!