Vikarabad Collector Attack : వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనపై ఏడిజి కీలక ఉత్తర్వులు
జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు...
Collector Attack : దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన(Collector Attack)ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలంగాణ డీజీపీ జితేందర్(DGP Jitender)ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సమీక్షించాలని ఏడీజీ మహేష్ భగవత్‌ను డీజీపీ ఆదేశించారు.
Vikarabad Collector Attack
ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటన(Collector Attack) అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఏడీజీ మహేష్ భగవత్ సమీక్షించారు. అనంతరం ప్రభుత్వానికి ఆయన సమగ్ర నివేదకను అందించనున్నారు. అందుకోసం ఇప్పటికే మహేశ్ ఎం భగవత్ వికారాబాద్(Vikarabad)కు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ దాడి ఘటనలో ఏడీజీ నివేదికే అత్యంత కీలకం కానుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం.
అందులోభాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుతో వికారాబాద్(Vikarabad) జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐజీ సమాశమయ్యారు. సోమవారం దాడి ఘటనపై వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో.. బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ దాడి కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు ఎవరో కాదు.. పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో పోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇంకో వైపు పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి.
అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. వికారాబాద్(Vikarabad) జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులోభాగంగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం.. దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఈ కార్యక్రమం కోసం ఉదయమే.. జిల్లా కలెక్టర్ ప్రతీక జైన్‌తోపాటు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు దుద్యాలకు వచ్చారు. కానీ గంట సేపే వేచి చూసినా.. ఆయా గ్రామస్తులు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇంతలో జిల్లా కలెక్టర్ వద్దకు స్థానిక బీఆర్ఎస్ నేత సురేశ్ వచ్చారు. రైతలంతా లగచర్లలో మీ కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగచర్లకు వెళ్లారు. స్థానిక రామాలయం వద్ద రైతులతో జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. అదే సమయంలో దాదాపు 20 నుంచి 30 మంది జిల్లా కలెక్టర్ వైపు దూసుకు వచ్చారు.
ఈ విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ప్రతీక్ జైన్‌ను.. ఆయన కారు వద్దకు తీసుకు వెళ్లారు. ఇక అదే సమయంలో ఇతర ఉన్నతాధికారులపై దాడి చేసేందుకు సదరు మూక ముందుకు కదిలింది. వారిని సైతం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇంతలో వ్యక్తిగత సిబ్బంది.. వెంటనే జిల్లా కలెక్టర్‌ను కారులో ఎక్కించారు. అదే సమయంలో ఆ కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే అడిషనల్ జిల్లా కలెక్టర్ లింగ్యా నాయక్‌తోపాటు స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారు దాడి నుంచి తప్పించు కోనేందుకు పంట చేలోకి పారిపోయారు. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో.. లగచర్లకు పోలీసులు వచ్చారు. దీంతో ఈ ఇద్దరు ఉన్నతాధికారులను పోలీసులు రక్షించారు. మరోవైపు జిల్లా ఉన్నతాధికారులపై దాడి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు నిరసన బాట చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read : CM Chandrababu : ఎమ్మెల్యేల విధానంపై భగ్గుమన్న సీఎం చంద్రబాబు