Minister Anitha : శాసనమండలిలో మహిళల అత్యాచారాలపై భగ్గుమన్న హోంమంత్రి
మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు...
Minister Anitha : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అయితే శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత(Minister Anitha) మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల్ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు.
Minister Anitha Comment
మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానం ఇస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత తెలిపారు. దిశ చట్టం లేదు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులు నిలదీశారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు.
అయితే హోం మంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ వైసీపీ నినాదాలు చేసింది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వారు సభకు వస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత అన్నారు. తన సమాధానం వినటానికి దమ్ము, ధైర్యం కావాలని మంత్రి అనిత అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత ప్రశ్నకు వైసీపీ సభ్యులు సభలోకి వచ్చారు.
Also Read : Minister Ponnam : కొత్త వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్