MLA KTR : రేవంత్ సర్కార్ ను ఎండగట్టడమే లక్ష్యంగా హస్తినకు పయనమైన కేటీఆర్
రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది...
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్(KTR) పెట్టుకున్నారు. బాధితులతో కలసి లగచర్ల ఘటనపై ఎస్టీ, ఎస్సీ, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం మధ్యహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్లో కేటీఆర్(KTR) ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. వారం రోజుల క్రితమే కేటీఆర్(KTR) ఢిల్లీ వెళ్ళి అమృత్ టెండర్లలో స్కాం జరిగిందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
MLA KTR Comments..
కాగాలగచర్లలో అధికారులపై దాడి ఘటనలో అరెస్టయిన బాధిత రైతుల కుటుంబాల సభ్యులు తమపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై వారు ఫిర్యాదు చేయనున్నారు. వారి వెంట సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలు తరలివెళ్లారు.
ప్రభుత్వం,పోలీసుల అరచకాలను, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులు, వారికి జరుగుతున్న అన్యాయలపై వివిధ జాతీయ కమిషన్లకు బాధితులు ఫిర్యాదు చేయనున్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పలు గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో లగచర్ల ఫార్మా బాధిత గిరిజన మహిళలు ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో కలిసి జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళ కమిషన్, జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు.
సోమవారంఉదయం 11 గంటలకు జాతీయ కమిషన్.. 11.45 నిమిషాలకు జాతీయ మానవహక్కుల కమిషన్… 12.30 నిమిషాలకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్.. 1.30 నిమిషాలకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లను కలసి పిర్యాదు చేయనున్నారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు కనిస్ట్యూషన్ క్లబ్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల బృందం ఇవాళ లగచర్ల గ్రామాని వస్తారు. సంగారెడ్డి జైలులో ఉన్న బాధితులను కలిసి వివరాలు సేకరించనున్నారు.
Also Read : AP Weather : వచ్చే రెండు రోజులు ఏపీలో వాతావరణం పై కీలక అప్డేట్