Deputy CM Pawan : కడపలో పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కలిసి అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘రాయలసీమ అంటే చదువుల నేల. ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి. ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు. అలాంటి రాయలసీమకు పునర్ వైభవం రావాలి’ అని అన్నారు.
Deputy CM Pawan Comment
2014-19మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ఇక సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అయితే, కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ పేర్కొన్నారు.
Also Read : MLA Harish Rao : భువనగిరి సభలో ప్రియాంక గాంధీ తో చెప్పించి ఇప్పుడు మాట మార్చారు