BJP Rajya Sabha MPs : రాజ్యసభ ఎంపీల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ

అందులో బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేస్తారు...

Rajya Sabha MP : మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు రేపటితో ముగియనుంది. కూటమి తరపున రేపు ముగ్గురు నేతల నామినేషన్‌ వేయనున్నారు.

BJP Rajya Sabha MPs List..

అందులో బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు ఆర్‌.కృష్ణయ్య. రేపు ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు నామినేషన్‌ వేయనున్నారు. అటు కూటమి తరపున మూడో అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. సానా సతీష్‌తో పాటు పలువురి పేర్లు పరిశీలినలో ఉన్నట్టు తెలుస్తోంది. సానా సతీష్‌ విషయంలో కూటమి పార్టీల ఏకాభిప్రాయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును ఆశావహులు కలుస్తుండటం గమనార్హం.

Also Read : AP Rains : ఏపీలో ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!