CM MK Stalin : అదానీతో భేటీ, పెట్టుబడులపై స్పందించిన సీఎం ఎంకే స్టాలిన్
సభలో విద్యుత్‌శాఖ మంత్రి హాజరుకాకపోవడం వల్లే తానీ ఈ వివరణ ఇస్తున్నానని చెప్పారు...
CM MK Stalin : అవినీతి ఆరోపణఓ్ల కూరుకుపోయిన వివాదాస్పద పారిశ్రామిక వేత్త అదానీని తానెన్నడూ కలుసుకోలేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరలేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) స్పష్టం చేశారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అదానీ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోలేదన్నారు.
CM MK Stalin COmment
పీఎంకే సభాపక్షనాయకుడు జీకే మణి మాట్లాడుతూ సోలార్ విద్యుదుత్పత్తి పథకాలకు సంబంధించి అదానీ గ్రూపు సంస్థలు భారీ ఎత్తున ముడుపులు స్వీకరించాయంటూ అమెరికా ప్రభుత్వం ఆయనపై పలు కేసులు నమోదు చేసిందని, ఆ కేసుల్లో తమిళనాడు రాష్ట్రం పేరు కూడా ఉందని, సోలార్ విద్యుత్ పరికరాల విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ఆ సందర్భంగా ముడుపులు ముట్టాయని కూడా ఆరోపణలున్నాయని, వీటిపై ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) సమగ్రమైన వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. పీఎంకే నేతలు అన్బుమణి, డాక్టర్ రాందాస్ ఇటీవలి కాలంలో తాను అదానీని కలుసుకున్నానని, సోలార్ విద్యుత్ పరికరాలను అదానీ గ్రూపు నుండి కొనుగోలు చేయడానికి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని అదే పనిగా అసత్య ఆరోపణలు చేశారని స్టాలిన్ చెప్పారు.
ఈవిషయమై విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారని, అదానీ సంస్థతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని, అదేపనిగా అసత్య ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు.తానింతవరకూ అదానీని చూసింది లేదు.. మాట్లాడింది లేదని స్టాలిన్ శాసనసభా ముఖంగా ప్రకటించారు. అదానీ అవినీతి అక్రమాలపై పార్లమెంట్ సంయుక్త కమిటీ విచారణ జరపాలని ప్రధాన ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయని, ఆ విషయమై పీఎంకే, బీజేపీ ప్రతిపక్షాల డిమాండ్‌కు మద్దతిస్తాయా? అని ప్రశ్నించారు. సోలార్ విద్యుత్ పరికరాల అవినీతి కేసులో రాష్ట్రానికి సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నందువల్లే తాను ముఖ్యమంత్రి వివరణ కోరారని జీకే మణి చెప్పారు. వెంటనే స్టాలిన్ బదులిస్తూ పార్లమెంట్‌లో ఉమ్మడి కమిటీలతో విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్‌కు పీఎంకే మద్దతిస్తుందో లేదో స్పష్టం చేయాలన్నారు. పీఎంకే నేతలు అసత్య ఆరోపణలు చేసి కపట రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
సభలో విద్యుత్‌శాఖ మంత్రి హాజరుకాకపోవడం వల్లే తానీ ఈ వివరణ ఇస్తున్నానని చెప్పారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని, అదానీనీ తానెన్నడూ కలుసుకోలేదని, అదే నూటిని నూరుపాళ్ళ నిజమని స్టాలిన్ అన్నారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ సమాధానం తమకు సంతృప్తి కలిగించలేదంటూ పీఎంకే సభ్యులంతా జీకే మణి నాయకత్వంలో సభ నుండి వాకౌట్ చేశారు.
Also Read : Rains Update : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం…మరో రెండు రోజుల వర్షాలు