Minister Atchannaidu : అధికారం కోల్పోయాక కూడా వైసీపీ తీరు మారలేదు
వ్యవసాయంలో డ్రోన్లను కూడా వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు...
Atchannaidu : గత ఐదేళ్లలో రైతు బక్క చిక్కిపోయాడని.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతాంగానికి అచ్చెన్న శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లు రైతుకు మద్దతు ధర లేదన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1600 కోట్లు బకాయిలు పెట్టిందని.. అవన్నీ తాము వచ్చాక క్లియర్ చేశామని తెలిపారు. ఈ యేడాది పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిందన్నారు. రైతు పండించే పంటను కొనుగోలు చేసి నాలుగు గంటల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మెకనైజేషన్‌పై ఒక్క రూపాయి పెట్టలేదని విమర్శించారు.
Minister Atchannaidu Comments
వ్యవసాయంలో డ్రోన్లను కూడా వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ధాన్యపు గింజా కొంటామని స్పష్టం చేశారు. పల్లె పండగలో భాగంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టారని.. అధికారం కోల్పోయినా వైసీపీ తీరు మారలేదని మండిపడ్డారు. పలాసలో సుపారీ గ్యాంగ్ ద్వారా నాగరాజును హత్య చేయాలని ఆలోచించటం దారుణమన్నారు. జిల్లాలో గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు. దీని వెనుక సూత్రధారులు ఎవరో తేల్చమని పోలీసులను కోరానని తెలిపారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు అని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Also Read : Puja Khedkar : మాజీ ఐఏఎస్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు