Minister Nadendla Manohar : వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన ఉండాలి

వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు...

Nadendla Manohar : వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) సూచించారు.వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డామని.. ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వినియోగదారుల హక్కులు మర్చిపోయేలా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. టీ పౌడర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని చెప్పారు.

Minister Nadendla Manohar Comments..

వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. దీపం -2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్‌గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆహార కల్తీ నివారణకు జిల్లాకో ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

Also Read : YSRCP : ఈ నెల 27 నుంచి విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం

Leave A Reply

Your Email Id will not be published!