Minister Anagani : ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో రావడంపై మంత్రి అనగాని హర్షం
తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు...
Minister Anagani : ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు నిన్న (శుక్రవారం) ఇంగ్లీషు, తెలుగులోనూ జీఓ ఏంఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయంపై మంత్రులు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్(Minister Anagani), అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా తెలుగు భాషాభిమానులు, రచయితలు, కవులు కోరుకుంటున్నట్లుగా ఇక నుంచి తెలుగులో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నాయన్నారు.
Minister Anagani Satya Prasad Comments
90శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ర్టంలో తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన మరింత పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం దివంగత నేత ఎన్టీఆర్ చేసిన కృషిని సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఆంగ్ల భాషలో ప్రవీణ్యం పెంచుకుంటూనే తల్లి భాష తెలుగులోని తియ్యదనాన్ని కూడా అందరూ అస్వాదించాలని మంత్రి అనగాని సత్యప్రాసాద్ పేర్కొన్నారు.
Also Read : TG News : యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరులో రియాక్టర్ పేలి ఒకరు మృతి