AP Cabinet Meeting : నేడు కీలక పథకాలకు ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్
కృష్ణా బ్యారేజ్ కుడి వైపు రూ.294 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది...
Cabinet Meeting : ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రూ.700 కోట్ల రుణానికి మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్ తీర్మానించింది. ఫెర్రో అల్లాయ్స్ కంపెనీలకు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ టారిఫ్‌లు మరో 6 నెలల పొడిగించింది. కొత్తగా మరో 62 నియోజక వర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ దగ్గర కుడి, ఎడమ కాలువల దగ్గర హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా బ్యారేజ్ కుడి వైపు రూ.294 కోట్ల నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
AP Cabinet Meeting Updates
నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిక జాబితా నుంచి తొలగించారని గుర్తించారు. ఆ భూముల గురించి ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల కేటాయింపు అంశంపై కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. రూరల్‌లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లకు వరకు అనుమతి ఇవ్వాలని తీర్మానించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఓకే చెప్పింది. 11 వేల 162 గ్రామ, 3 వేల 842 వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం తీర్మానించింది. జనాభా ప్రాతిపదికన A, B, C కేటగిరీలుగా వీటిని విభజించాలని నిర్ణయించింది.
Also Read : Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీతో భారీ ఊరట