TG Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి 2.0 లో ఉండే మంత్రులు వీరే
కేబినెట్ బెర్త్ల కోసం ప్రసిద్ధ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు...
TG Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్‌డౌన్ షురూ అయింది. సంవత్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సస్పెన్స్ త్వరలో ముగియనుంది. ఈ అంశం ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కు చేరింది. ఒకటి, రెండు రోజుల్లో లిస్ట్ ఫైనల్ చేయడానికి ఢిల్లీలో వరుస మీటింగులతో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
TG Cabinet Expansion Updates
ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, విస్తరణను కీలకంగా మారుస్తోంది. రేవంత్ మార్క్ తో పాటు మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బెర్త్ ఇవ్వాలని సీఎం హామీ ఇచ్చారు.
కేబినెట్ బెర్త్ల కోసం ప్రసిద్ధ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఆది శ్రీనివాస్ కూడా ఆశావహులలో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాతో పాటు, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 4 మంత్రివర్గ స్థానాలను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల చర్చలు జరిగాయి. ముఖ్యంగా పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించారు. 15-20 మంది ఉపాధ్యక్షులు ఉండే అవకాశముంది.
మంత్రివర్గంలో మార్పులు పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసుల విషయంలో తొందరపాటు లేదు, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ కోరలేదని, తాను ఎవరినీ పదవుల కోసం ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు.
Also Read : Donald Trump Slams :ఐసీసీకి ఘాటుగా బదులిచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్