RBI New Rules : సైబర్ మోసాలను అరికట్టేందుకు కొత్త డొమైన్ తీసుకొచ్చిన ఆర్బీఐ

తాజాగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది...

RBI : ఆర్థిక సేవల కోసం డిజిటలైజేషన్ ప్రగతిని మరింత వేగవంతం చేసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా విస్తరిస్తున్నాయి. ఎన్నో మంది డిజిటల్ మోసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ(RBI) చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

RBI New Rules

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకమైన “.bank.in” డొమైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త డొమైన్ ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడం, ఫిషింగ్ దాడులను తగ్గించడం, డిజిటల్ బ్యాంకింగ్ మరియు చెల్లింపు వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “.bank.in” డొమైన్‌ను ఏప్రిల్ 2025 నుండి అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లను మరియు మోసపూరిత వెబ్‌సైట్‌లను గుర్తించడంలో కస్టమర్‌లకు సహాయం చేయడం ప్రధాన లక్ష్యం.

ఈ కొత్త డొమైన్ పేరు కోసం రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. దీనితో బ్యాంకింగ్ మోసాలను నివారించడంలో సహాయపడటం లక్ష్యంగా ఉంటుంది. తరువాత, ఆర్థిక రంగానికి “fin.in” డొమైన్‌ను కూడా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

Also Read : Minister Amit Shah : ఈ 26న చెన్నై ఈషా ఫౌండేషన్ ఆశ్రమానికి కేంద్ర హోంమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!