Rahul Gandhi-Jyoti Malhotra : నెట్టింట దుమారం రేపుతున్న రాహుల్ గాంధీ, జ్యోతి మల్హోత్రా ఫోటో
ఇందులో మార్ఫింగ్ వ్యవహారం ఏదైనా ఉందా అనేది ఆసక్తికరంగా మారింది...
Rahul Gandhi : పాకిస్తాన్‌తో గూఢచర్యానికి పాల్పడిన ఆరోపణలపై గత నెలలో అరెస్టయిన యూబ్యూటర్ జ్యోతి మల్హాత్రాతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి ఉన్నట్టు ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పలువురు నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ”గూఢచర్యం చేస్తూ పట్టుబడిన హర్యానాకు చెందిన చెందిన యూబ్యూటర్‌తో రాహుల్ ఉన్నారు. ప్రతి ద్రోహి, జాతివ్యతిరేక శక్తి రాహుల్‌తో కనిపిస్తుండం చాలా స్ట్రేంజ్. దేశానికి ఎదురవుతున్న కల్లోలాల వెనుక రాహుల్ ఉన్నారా?” అని ఓ నెజియన్ సూటి ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటో వెనుక నిజం ఎంత? ఎప్పటిదీ ఫోటో? ఇందులో మార్ఫింగ్ వ్యవహారం ఏదైనా ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.
Rahul Gandhi-Jyoti Malhotra Photo Viral
పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీలు రాహుల్(Rahul Gandhi), జ్యోతి మల్హోత్రా ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలుగా డిక్లేర్ చేసాయి. గూగుల్ ఇమేజ్ సెర్చ్ వివరాల ప్రకారం, 2018లో పలు మీడియా సంస్థలు ఒరిజనల్ ఫోటోను ప్రచురించాయి. అప్పటికి మల్హోత్రా తన యూబ్యూట్ కెరీర్‌ను ప్రారంభించనే లేదు. మార్ఫ్‌డ్ ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు రాహుల్‌తో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ మాజీ నాయకురాలు అదితి సింగ్ అని తేలింది. జ్యోతిమల్హోత్రా ఏదైతే చీర కట్టుకుని వైరల్ ఫోటోల్లో ప్రస్తుతం కనిపిస్తోందో అదే చీరలో అదితి సింగ్ కనిపిస్తున్నారు. అదే ఫోజులో కూడా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వ్యక్తి కూడా మారలేదు. అదితి సింగ్‌తో రాహుల్ ఫోటో ఏళ్ల క్రితం నాటిది. ఆమె 2017లో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదితిసింగ్ రాయబరేలికి చెందిన కాంగ్రెస్ మాజీ నాయకురాలు. 2021లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె రాయబరేలి సదర్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పాకిస్తాన్‌తో గూఢచర్యం నడుపుతున్నారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) గత నెలలో అరెస్టయ్యారు. పాకిస్తాన్ హెకమిషన్ స్టాఫర్ డేనిష్‌తో 2023 నవంబర్ నుంచి ఆమ్ సంప్రదింపులు సాగిస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటోంది. గుఢచర్యానికి పాల్పడుతున్న ఆరోపణలపై డేనిష్‌ను మే 13న ఇండియా నుంచి బహిష్కరించారు. జ్యోతి మల్హోత్రా గుఢచర్యం వ్యవహారంపై ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు లోతుగా ఆమెను విచారిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌లో ఆస్తులను పెంచుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. యూట్యూబ్‌లో ఆమెకు 3.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో తాను పర్యటించినట్టు విచారణలో ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై గత రెండు వారాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మందిని అరెస్టు చేయగా అందులో జ్యోతి మల్హోత్రా ఒకరు.
Also Read : Pakistan Terrorists : సొంత దేశం పై ఉగ్రదాడి.. 32 మంది సైనికుల దుర్మరణం