MD Rafi: డిసెంబర్ 24… అలనాటి మేటి గాయకుడు మహమ్మద్ రఫీ జయంతి

MD Rafi:ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ చిత్ర సీమలో ఒకనాడు మకుటం లేని మహారాజుగా వెలిగాడు. హిందీ సినిమా రంగం 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు.

MD Rafi: ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ చిత్ర సీమలో ఒకనాడు మకుటం లేని మహారాజుగా వెలిగాడు. హిందీ సినిమా రంగం 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయనేది నూటికి నూరుపాళ్లు నిజం.

తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించిన మహ్మద్ రఫీ 24 డిసెంబర్ 1924 పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించాడు. బాల్యంలో తమ గ్రామానికి వచ్చే ఫకీర్ల గానాన్ని రఫీ అనుకరించే వాడు. అలా చిన్నప్పడే సంగీతంతో మక్కువ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఉస్తాద్ బడే గులామ్ అలీ ఖాన్ వద్ద రఫీ సంగీత శిక్షణలో రాటుదేలాడు. అలా సినిమాల్లో పాటలు పాడడానికి 1944లో బొంబాయి వెళ్లాడు.

గావ్ కీ గోరి’ అనే హిందీ చిత్రంలో జి.ఎం.దురానీ తో కలిసి రఫీకి మొదటిసారి పాడే అవకాశం వచ్చింది. రఫీ పాడిన తొలి హిందీ గీతమిది. ఆ తర్వాత 1948లో గాంధీజీ హత్య జరిగినపుడు రఫీ ‘సునో సునో ఏ దునియావాలో బాపూజీకి అమర్ కహానీ’ పాటతో పాపులర్ అయ్యాడు. ఈ పాటకు భారత ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందుకున్నాడు.

MD Rafi: స్మృతిలో.. భారతీయ గాన సమ్రాట్ ‘మహమ్మద్ రఫీ’..

హిందీ సినిమా గాన జగత్తులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బుర పరచాడు, లతా మంగేష్కర్ ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది.

మహ్మద్ రఫీని వరించిన అవార్డులకు లెక్కేలేదు. కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డుతో పాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి. హిందీతో పాటు 17 భారతీయ భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడాడు. తొలితరం భారతీయ సినీ సంగీత సాగర ప్రయాణానికి దిక్సూచి లాంటి వాడు రఫీ. పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రిషీ కపూర్ వంటి మూడు తరాల బాలీవుడ్ నటులకు స్వరాలు అందించిన ఘనత రఫీ సొంతం. తెలుగు విషయానికొస్తే…తండ్రి ఎన్టీఆర్, కొడుకు బాలకృష్ణకు ప్లేబ్యాక్ అందించారు రఫీ.

నౌషాద్ కోసం రఫీ మొత్తం 149 పాటలు, బర్మన్‌తో కలిసి 37 చిత్రాలలో పని చేశాడు, శంకర్ – జైకిషన్ కోసం రఫీ మొత్తం 341 సంఖ్యలను (216 సోలో) పాడారు. కల్యాంజీ ఆనంద్జీ రఫీ స్వరంలో సుమారు 170 పాటలు కంపోజ్ చేశారు. రవితో , మదన్ మోహన్‌తో , ఓ పీ నయ్యర్‌తో, లక్ష్మీకాంత్ – ప్యారేలాల్‌తో, రోషన్, జైదేవ్, ఖయ్యామ్, రాజేష్ రోషన్, రవీంద్ర జైన్, బాపి లాహిరి, సపన్ జగ్మోహన్ వంటి సంగీత దర్శకులందరికీ తరచూ పాడారు. ఉషా ఖన్నా , సోనిక్ ఒమి , చిత్రగుప్తా , ఎస్ఎన్ త్రిపాఠి , ఎన్. దత్తా మరియు ఆర్.డి బర్మన్ లాంటి సంగీత దర్శకులతో పని చేశాడు. అనేక ప్రైవేట్ ఆల్బమ్‌లను వివిధ శైలులు మరియు భాషలలో రికార్డ్ చేశాడు. గిన్నీస్ రికార్డు ప్రకారం భారతీయ భాషలలో 28,000 పాటలను రికార్డ్ చేసినట్లు పేర్కొన్నారు.

రఫీ రెండు సినిమాల్లో నటించాడు. లైలా మజ్ను (1945) చిత్రంలో “తేరా జల్వా జిస్ నే దేఖా” మరియు జుగ్ను (1947) చిత్రంలో “వో అప్ని యాద్ దిలాన్ కో” పాటల కోసం తెరపై కనిపించాడు.

1948 – స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని జవహర్లాల్ నెహ్రూ చేతుల ద్వారా ప్రదానం చేయబడింది. 1967 – భారత ప్రభుత్వంచే పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయ బడింది.
2001 – హీరో హోండా, స్టార్ డస్ట్ మేగజైన్ లద్వారా “బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం గౌరవ ప్రదానం.
2013 – సి ఎన్ ఎన్.. ఐ బి ఎన్ పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమాగా ఎన్నికయ్యాడు.

“చౌధవీఁ కా చాంద్ హో , తేరి “ప్యారీ ప్యారీ సూరత్ కో”, “చాహూంగా మై తుఝే సాంఝ్ సవేరే”, “బహారో ఫూల్ బర్సావో”,
“మై గావూ తుమ్ సోజావో”, “ఖిలోనా జాన్ కర్”, “క్యా హువా తేరా వాదా”, ఇలా ఒక్కటేమిటి, రఫీ పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి.

తెలుగులో ఆయన పాడిన ప్రతి పాట ఆణిముత్యమే. ‘భలే తమ్ముడు’ చిత్రంలోని ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ, ఎన్టీఆర్ ‘ఆరాధన’లో నా మది నిన్ను పిలిచింది గానమై.. ‘అక్బర్ సలీం అనార్కలి’లో ఆయన పాడిన సిపాయి పాట నేటీకి తెలుగు ప్రేక్షకుల్లో మనసుల్లో అలాగే నిలిచి వుంది.

1980 జూలై 31న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లి దాదాపు 40 ఏళ్లు దాటినా ఆయన స్వరం ప్రతిగుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అందుకే భారతీయ సినీ సంగీత ప్రపంచంలో రఫీ అమర గాయకుడిగా నిలిచిపోయారు.

No comment allowed please