తెలంగాణలో నదీ ప్రవాహాలు కొండల్లోంచి వెళతాయి..అది ఆంధ్రా ద్రోహమా?

శ్రెరాంసాగర్, నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులు తెలంగాణాలోనే..ఆంధ్రాలో ధవళేశ్వరం బ్యారేజ్ తప్ప ఏమీ లేదు

అక్కడ తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యేమిటంటే..నీరు కొండలోయల్లోంచి ప్రవహిస్తుంటుంది. అది పైకి రావాలి..అందుకనే.. గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రంలో లిఫ్ట్ మీద లిఫ్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టి..నీళ్లు తోడుతున్నారు. అందుకు ఆంధ్రావాళ్లేమీ అనడం లేదు..కానీ మీ ఎగువ తెలంగాణ ప్రాంతం నుంచి నీరు వస్తేనే కదా.. ఇక్కడ దిగువ ప్రాంతమైన ఆంధ్రాకు నీళ్లు రావాలి.. కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతూ..ఆంధ్రాలో వద్దు అనడం సమంజసమేనా.. మరి ఇదెక్కడి న్యాయమో వారికే తెలియాలి. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో చేసే పనే..ఇక్కడ ఏపీలో చేస్తున్నారు. మీరు లిఫ్ట్ చేస్తున్నారు. ఏపీలో కూడా పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ వద్దు అంటుంటే..మీరు అన్ని కట్టుకుంటుంటే మేమైనా అన్నామా? అని జగన్ అంటున్నారు. ఇదే జలవివాదానికి ప్రధాన కారణం. కృష్ణా, గోదావరి ఆంధ్రాకు వెళ్లిపోయాయ్..మా నీళ్లన్నీ వాళ్లు వాడేశారు..అదే తెలంగాణ ఉద్యమ లక్ష్యం..అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది.

అసలు ఏపీలో గట్టిగా ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? ఆ ధవళేశ్వరం తప్ప.. అన్నీ తెలంగాణలోనే కదా ఉన్నాయి..గోదావరికి సంబంధించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కృష్ణా జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అక్కడ ఎస్ ఎల్ బీసీ.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నాయా? ఆ నీళ్లు హైదరాబాద్ కి వెళుతున్నాయా? నిజాలు తేల్చాల్సిందే.. అని ఆంధ్రా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆంధ్రా సెంటిమెంటు కార్డు ఎక్కువ కాలం పనిచేయదని, కరోనా ని అరికడతాం అని చెప్పిన డైలాగులకే తెలంగాణ ప్రజల కళ్లు తెరుచుకున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

 

Leave A Reply

Your Email Id will not be published!