నాలుగు గదుల్లో దాచు కోవాల్సినవన్నీ ఇపుడు బహిర్గతమై పోతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ మంచి కంటే చెడు ఎక్కువగా ముక్కు పచ్చలారని యువతీ యువకులను టార్గెట్ చేస్తోంది. భోజనం లేకుండా ఉండగలరమో కానీ మొబైల్స్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు. కాదంటే బాధ..వద్దంటే కోపం..కన్నవారి మీద కసురు కోవడాలు..కుటుంబం అంటే గౌరవం లేదు. పాఠాలు చెప్పే వారి పట్ల కృతజ్ఞత లేదు. బట్టీ పట్టడాలు..ర్యాంకుల మోతలు..ఇలా చెప్పుకుంటూ పోతే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. చెప్పుకోవాలంటే సిగ్గు చేటు. 60 ఏళ్లకే రావాల్సిన అనుభవం ఇపుడు 10 ఏళ్ల పిల్లలకు అర్థమై పోతోంది.
ఇదేమిటంటే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయిగా..పేరెంట్స్ తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. నూటికి 90 శాతం పిల్లలను పట్టించు కోవడం లేదు. గాలికి వదిలి వేస్తున్నారు. పాఠాలు బోధించాల్సిన వాళ్లు సైతం ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్నారు. బంధాలకు అర్థం లేకుండా పోయింది. డాలర్ల మాయలో పడిన వీరంతా దేశాన్ని ఏం రక్షిస్తారో తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో ..గూగుల్ వచ్చాక..రిలయన్స్ జియో ఎంటర్ అయ్యాక..కోట్లాది కుటుంబాల్లో ప్రైవసీ అంటూ లేకుండా పోయింది. ఎవరు ఏం చేస్తున్నారో ..ఏం చూస్తున్నారో తెలియడం లేదు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా ..జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సమేతంగా కలిసి చూసే సినిమాలు వచ్చి ఛాన్నాళ్లయింది.
బస్సులో ముద్దు పెట్టేసి..కార్యం గురించి షాపింగ్ మాల్‌లో నటీ నటుల మధ్య డైలాగ్స్ రాసిన డైరెక్టర్ కు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అంతగా ఎదిగి పోయామా లేక మనల్ని మనం తగ్గించుకుంటున్నామా. ఎథిక్స్ లేవు. విలువలు అసలే లేవు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. లెక్కలేనన్ని కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కౌమార దశలో కంట్రోల్ చేసుకోవాల్సిన యువత బూతును చూడటంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ప్రేమో..ఏది మంచో ..ఏది చెడో తెలియ చేయాల్సిన పేరెంట్స్ ..వారు కూడా అందులోనే కూరుకు పోయారు.
ఈ జాడ్యం ఎంతలా పాతుకు పోయిందంటే విస్మరించు కోలేనంత ..వదిలించు కోలేనంతగా చేరిపోయింది. సభ్య సమాజానికి బాధ్యత వహించాల్సిన వాళ్లు..ఆదర్శప్రాయంగా ఉండాల్సిన యువత 90 శాతానికి పైగా నెట్ కు అడిక్ట్ అయిపోయింది. మాదక ద్రవ్యాలు.మద్యం..మనీ..మాఫియా ..క్రైం కంటే ప్రమాదకరంగా తయారైంది ఈ కనెక్టివిటీ. అంతర్జాలం అధః పాతాళానికి తొక్కేస్తోంది. ఈ విలువైన ప్రాణాలన్నీ గాలిలో దీపాలై పోయాయి. బాధ పడటం తప్ప చేసేదేముంది కనుక..!
No comment allowed please