Amaravathi Railway Line : అమరావతి రైల్వే లైన్ కి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది...

Amaravathi Railway  : అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.

Amaravathi Railway Line Approved..

అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.అమరావతి రైల్వే(Amaravathi Railway) అనుసంధానం ప్రాజక్టుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ. 2,245 కోట్లతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్‌ నిర్మించనుంది. అమరావతి(Amaravathi) నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ.. కొత్త లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.. ఈ లైన్‌ ద్వారా… దక్షిణ భారతాన్ని మధ్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువుకానుంది.

అమరలింగేశ్వర స్వామి, అమరావతి(Amaravathi) స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చెందనుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానిస్తూ.. నిర్మాణం కొనసాగనుంది. ఈ లైన్‌ నిర్మాణం ద్వారా 19 లక్షల పనిదినాలు కల్పన జరగనుంది.. ఈ లైన్‌ నిర్మాణంతో పాటు… 25 లక్షల చెట్లు నాటుతూ… కాలుష్య నివారణకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్‌ నిర్మాణం సాగనుంది. కొత్తగా నిర్మించే రైల్వే లైన్‌. ఎర్రుపాలెం నుంచి అమరావతి(Amaravathi) మీదుగా నంబూరు వరకు ఈ రైల్వే లైనును అనుసంధానించనున్నారు .తెలంగాణలో ఖమం జిల్లా, ఏపీలో ఎన్‌టిఆర్‌ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం సాగనుంది.

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌(Ashwini Vaishnav) వెలువరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి, బీహార్‌ రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం రూ. 6,789 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదించింది. ఏపీ రాజధాని అనుసంధానానికి 57 కి.మీ, బీహార్‌లో 256 కి.మీ రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొత్త లైన్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతి(Amaravathi)కి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుందని అశ్వనీ వైష్ణవ్‌(Ashwini Vaishnav) వెల్లడించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు మెరుగైన వ్యవస్థలా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. బహుళ-ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను సులభతరం చేయడంతోపాటు… రద్దీని తగ్గిస్తుందని తెలిపారు. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే విభాగాల్లో చాలా అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తుందని అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.

కాగా.. అమరావతి రైలు(Amaravathi Railway) మార్గానికి తొలి అడుగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయించారు. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని పలువురు భావించారు. అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం నిధుల కేటాయింపు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై రైల్వే వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌‌‌ను ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు కావడంతో ఏపీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీల ప్రయత్నాలు ఫలించినట్లు అర్థమవుతోంది. ఇంచుమించు ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత తొలిసారిగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి కేంద్రం ఉదారతను చాటుకున్నది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా భారీగానే నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ-1 ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్‌ ఎర్రుపాలెం – నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి – పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి – నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్‌ కూడా ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. అయితే ఎన్‌డీఏ-1 చివరలో బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన అనేది ఐదేళ్లలో తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం కావడంతో అమరావతి రైలుమార్గానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.

ఇక నిర్మాణంలో ఉన్న నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్‌ ఫండ్‌ కింద రూ.250 కోట్లు, కేపిటల్‌ ఫండ్‌ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమల అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో ఏకంగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు – బీబీనగర్‌ డబ్లింగ్‌ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాసు రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి – విష్ణుపురం డబ్లింగ్‌ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రైలుమార్గంలో మోటుమర్రి వద్ద ఓవర్‌ రైలు బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. అలానే గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్‌ కనెక్టివిటీ పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు కేటాయించింది.

Also Read : Phone Tapping Case : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు తిరుపతన్న

Leave A Reply

Your Email Id will not be published!