varshini : సినిమా ఇండస్ట్రీ కానీ ఫ్యాషన్ ప్రపంచం అంతా పైకి కనిపించేంత అందంగా అయితే ఉండదనేది అందరికీ తెలిసిన నిజం.. అవకాశం ఉన్నవారు, అవకాశాల కోసం ఎదురుచూసే వారు ఈ రెండు రకాల వ్యక్తులు అక్కడ తారసపడుతుంటారు. మాకు ఇంట్రస్ట్ మాత్రమే ఉంది..అవకాశం వస్తేనే చేస్తామని చెప్పేవాళ్లు ఉన్నారు.. అలాంటి కోవలోకి చెందిన అమ్మాయి యాంకర్ వర్షిణి.. ఈ మధ్య ఈటీవీలో వచ్చే డీ షోతో బాగా పాపులర్ అయ్యింది. అంతకుముందు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా చేసింది గానీ.. డీ షో ద్వారానే పాపులర్ అయ్యిందనేది నిజం..

ఈ మధ్య ’ఆలీతో సరదాగా‘ షో సందర్భంగా పక్కనే హైపర్ ఆది ప్రోత్సహించడంతో చెప్పవచ్చో లేదోననే సంశయంతోనే ఒక విషయాన్ని బయటపెట్టింది. అదేమిటంటే ఒక వెబ్ సిరీస్ కోసం ఒక డైరెక్టర్ పిలిచాడు.. సరే అని వెళ్లాను. స్టోరీ చెప్పాడు..వివరాలు చెప్పి..ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పి..ఒక్కసారి నా చేయి పట్టుకొని తనవైపునకు లాగాడు..అంతే నేను మళ్లీ అక్కడికి వెళ్లలేదు.. అవకాశాల కోసం నేనెక్కడికి వెళ్లలేదు..ఏ ఆఫీసు మెట్లు ఎక్కలేదు. నాకు నచ్చదు. డీ షో కూడా వాళ్లంతట వాళ్లే నా వద్దకు వచ్చారని చెప్పింది.
ఈసారి నుంచి వర్షిణి విషయంలో కొందరు జాగ్రత్తగా ఉంటారు. అలాగే ధైర్యంగా చెప్పినందకు అందరూ అభినందిస్తున్నారు కూడా..అదే సమయంలో పబ్లిక్ షోల ..కొంచెం సంయమనం పాటించాలని కూడా కొందరు హితవు చెబుతున్నారు.
