AP Elections 2024 : రీపోలింగ్ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ... మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...

AP Elections 2024 : చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఎ, ఇతర పత్రాలను మరోసారి పరిశీలించి నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రేపొలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ రోజు అవకతవకలు జరిగాయని మోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.

AP Elections 2024…

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ… మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా, మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తాజా ఎన్నికల డిమాండ్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Arunachal Pradesh Elections : అరుణాచల్ ప్రదేశ్ లో 3వ సారి విజయం సాధించిన బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!