AP Govt : కాకినాడ పోర్ట్ లో సీజ్చేసిన స్టెల్లా షిప్ వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక చర్చ
ఆ తర్వాత షిప్లో తనిఖీలు చేపట్టి.. రేషన్ బియ్యమా కాదా అని తేల్చాల్సి ఉన్నా..
AP Govt : కాకినాడలో నిలిపివేసిన స్టెల్లా షిప్‌పై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అందులో పట్టుకున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే అవకాశం ఉంది. ఇటీవల షిప్లో సేకరించిన 26 బియ్యం శాంపిల్ ఫలితాలను కలెక్టర్ వెల్లడించనున్నారు. కాకినాడ(Kakinada) పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు నూక బియ్యం ఎగుమతులు ఆగిపోవడంపై కేంద్రప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తనిఖీల పేరుతో అధికారులు బియ్యం ఎగుమతులకు ఆటంకం కల్పించడంపై కలెక్టర్‌కు లేఖ రాసింది. ఏసీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే విషయంపై చర్చానీయాశంగా మారింది.
AP Govt…
కాగా..కాకినాడ(Kakinada) పోర్టులో ‘సీజ్ ద షిప్’ ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నవంబర్ 29న పారాబాయిల్డ్ బియ్యం లోడుతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న స్టెల్లా నౌకను.. రేషన్ బియ్యం ఎగుమతి అవుతోందనే అనుమానంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత షిప్లో తనిఖీలు చేపట్టి.. రేషన్ బియ్యమా కాదా అని తేల్చాల్సి ఉన్నా.. ల్యాబ్ నివేదిక రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నౌక నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో రోజుకు రూ.22వేల డాలర్ల డెమరేజీ చార్జీల భారం మోయాల్సి వస్తోందని ఎగుమతి దారులు తాజాగా శుక్రవారం అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించారు.
వాస్తవానికిమొత్తం 28మంది ఎగుమతిదారులు కలిపి నౌకను అద్దెకు తీసుకోగా, వీరిలో 15మంది తమ బియ్యం లోడింగ్ పూర్తిచేశారు. మరికొందరు లోడ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు స్టెల్లా షిప్‌లోకి బియ్యం లోడింగ్ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాపారపరంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటూ కాకినాడ(Kakinada)కు చెందిన చిత్రా అగ్రి ఎక్స్‌పోర్టు, సూర్యశ్రీ రైస్‌మిల్, పద్మశ్రీ రైస్ మిల్లు ప్రతినిధులు అమరావతిలోని అడ్మిరాలిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము పశ్చిమ ఆఫ్రికా దేశానికి పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి చేయడానికి నౌకను అద్దెకు తీసుకున్నామని, కానీ నౌకలోకి బియ్యం లోడింగ్‌కు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్లో ప్రస్తావించారు.
ఇలాఅడ్డుకోవడం ఫారెన్ ట్రేడ్ పాలసీకి విరుద్ధమని, ఈ చట్టం ప్రకారం బియ్యం ఎగుమతి ఆపడానికి లేదని స్పష్టం చేసింది. పైగా నౌకలోకి బియ్యం లోడింగ్ ఆపాలని కలెక్టర్, పోర్టు అధికారులు ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలూ ఇవ్వలేదని, కేవలం నోటిమాటతో ఆదేశాలు ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో డెమరేజీ చార్జీల భారంతో తీవ్రంగా నష్టపోతున్నామని, తమ మూడు కంపెనీలకు చెందిన 3,470 మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును శుక్రవారం అభ్యర్థించారు. ఎవరైతే నౌకలోకి ఇప్పటికే తమ వాటా బియ్యం లోడ్ చేశారో వారు మినహా మిగిలిన వారు రోజుకు 22వేల డాలర్ల డెమరేజీ చార్జీల భారం మోయాల్సి ఉంటుందని తెలిపారు.
Also Read : Minister Parthasarathy : జోగి రమేష్ వివాదం పై హై కమాండ్ కి క్షమాపణలు చెప్పిన మంత్రి