AP High Court : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్ట్
ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ నేతల న్యాయవాదులు వాదించారు...
AP High Court : వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు(AP High Court) స్పస్టం చేసింది. వాస్తవానికి ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు.
ఇందుకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని వైసీపీ(YSRCP) నేతల న్యాయవాదులు వాదించారు. అయితే, సుప్రీంకోర్టు ఎప్పుడూ ఇలాంటి తీర్పు ఇవ్వలేదని టీడీపీ తరఫున న్యాయవాదులు స్పష్టం చేశారు. తీర్పులను పరిశీలించిన ధర్మాసనం.. తన తీర్పును వెలువరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌కు బెయిల్ తిరస్కరించింది ధర్మానసం. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
AP High Court Order..
వైసీపీ అధికారం ఉన్నన్నాళ్లు ఆ పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు రెచ్చిపోయి ప్రవర్తించారు. విపక్ష నేతలు, వారి ఆస్తులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే 19 అక్టోబర్ 2021న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ ఆఫీసులోకి దూసుకొచ్చి.. కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆఫీసులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లు ఈ కేసును మరుగున పడేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. వైసీపీ నేతల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : Rahul Gandhi : తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన రాహుల్ గాంధీ