AP High Court Bench : కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ఇరు సభలు ఆమోదం

High Court : ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు(High Court) బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు(High Court) శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిన్ననే (బుధవారం) కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపామని.. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

High Court Bench Updates

అమరావతి కూడా చాలా సార్లు చెప్పామని.. మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది అని అనుకున్నప్పడు బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్ళామన్నారు. తెలుగుగంగా, మంద్రీనీవా, నగరీ, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తిచేసిందన్నారు. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యూకేషన్ హబ్‌గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హమీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిచేస్తుందని తెలిపారు.

రాయలసీమలో నీటి సమస్యను ఎదుర్కోనేందుకు డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. తిరుపతి హర్డ్ వేర్ హబ్‌గా తయారైతే కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ పార్కులను కేంద్రం ఇస్తే.. రెండు రాయలసీమలో పెట్టామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని పెట్టడంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో పెట్టడానికి నేడు సభలో తీర్మానం చేస్తున్నామని.. సభ్యులు ఈ తీర్మానాన్ని సమర్ధించాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చేసిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Also Read : Deputy CM Bhatti : ఎందరు ఎన్ని కుట్రలు చేసిన కులగణన చేసి చూపిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!